మంగళ్‌హాట్: తెలంగాణలోని అన్ని జిల్లాలతో పా టు కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కా లిన గాయాలు, ప్రమాదాల్లో చర్మం ఊడిపోయి చికిత్సల నిమి త్తం ఉస్మానియాకు వచ్చే వారికి అత్యాధునిక పద్ధతుల్లో సర్జరీలు చేసి వారికి పూర్వ రూపం అందించడంలో ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు ముందున్నారు. సూపర్ స్పె షాలిటీ సేవలు అందిస్తూ రోజూ 3 నుంచి 4 స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ శాతం కాలిన గాయాలతో వచ్చే వారికి దశల వారీగా చర్మం తీసి కాలిన ప్రాంతంలో సర్జరీ ద్వారా అమర్చుతుంటారు. కాలిన వ్యక్తి తొడ భాగంతోపాటు ఇతర భాగాల నుంచి తీసే చర్మం సరిపోవడం లేదు.
ఒక వ్యక్తి నుంచి ఒక సారి చర్మం తీసిన తరువాత 2, 3 వారాల తారువాతే మళ్లీ అదే భాగం నుంచి చర్మం తీసుకోవచ్చు. మొదటి సారి చర్మం తీసిన తరువాత ఆ చర్మం సరిపోకపోవడంతో మరో మారు తీసేందుకు 2, 3 వారాల పాటు ఆగాల్సి రావడంతో అప్పటికే సదరు రోగికి ఇన్ఫెక్షన్ సోకి రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ఆస్పత్రిలో స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఇన్ఫెక్షన్‌కు తావు లేకుండా ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆస్పత్రి వైద్యులు ఏడాది క్రితమే ప్రతిపాదనలు పంపారు.