పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

కాకినాడ నగరం: పేదల ఆరోగ్య పరిరక్షణకు వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. 29వ డివిజన్‌కు చెందిన దేవాడ దుర్గాప్రసాద్‌ ప్రమాదానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. ఆయనకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.75 వేల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ వాసిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


కౌన్సిల్‌ న్యాయవాదికి అభినందన


దేవాదాయ శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ట్రైబ్యునల్‌ జోన్‌-2 న్యాయవాదిగా నియమితులైన కృష్ణప్రకాష్‌ను ఎమ్మెల్యే ద్వారంపూడి అభినందించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యకుమార్‌, బుజ్జి, పెద్దిరత్నాజీ తదితరులున్నారు.