కోయిలకొండ: మండలంలోని ఇబ్రహీంనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ ఆంజనేయులు ఆరోగ్య కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలన్నారు. ప్రభుత్వం బాలికల కోసం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక స్థాయి నుంచే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎంపీటీసీ సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్, ఉపాధ్యాయులు పురంధర్‌రెడ్డి, పాండునాయక్, పాఠశాల కమిటీ ఛైర్మన్ కృష్ణయ్య పాల్గొన్నారు.