కారేపల్లి : చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఈ నెల 25న ముత్యాలగూడెంకు చెందిన సమ్మయ్య, సత్యం(40) ద్విచక్ర వాహన ప్రమాదంలో సమ్మయ్య మృతి చెందగా సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలో చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడికి భార్య, డిగ్రీ చదువుతున్న కుమారుడు, ఇంటర్ చదువుతున్న కూతురు ఉన్నారు. ప్రమాద స్థలంలో తక్షణమే స్పీడ్ బ్రేకర్లతోపాటు, సూచికలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపతున్నామని సీఐ శ్రీనివాసులు అన్నారు.