భీంపూర్ పీహెచ్‌సీ ఎదుట నిరసన
భీంపూర్, (ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడితో సహా ఇద్దరు ఏఎన్‌ఎంలు తనను మానసికంగా వేధిస్తున్నారని పాలొది ఆశాకార్యకర్త రణిత భీంపూర్ పీహెచ్‌సీ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. నీతి, నిజాయతీ, బాధ్యతతో పనిచేస్తున్నా విధులకు సంబంధించి సమాచారం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఆశాకార్యకర్తల అత్యవసర నిధుల దారి మళ్లింపుపై ప్రశ్నించినందుకే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశానని, సదరు వైద్యుడు, ఏఎన్‌ఎంలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే అధికారులదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. నిరసనలో భీంపూర్ సర్పంచి లింబాజీ, ఉపసర్పంచి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.