తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కి చేరింది. ఇప్పటివరకు 545 మందిని డిశ్చార్జ్ చేశారు. ఆదివారం కొత్తగా 46 మంది డిశ్చార్జ్‌ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 508. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 29 మంది మృతి చెందారు. గత 14 రోజుల్లో 17 జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది.