ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి):రిమ్స్ వైద్య కళాశాల ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల రిమ్స్ డైరెక్టర్ వైఖరిని నిరసిస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సోమవారం కళాశాల ప్రాంగణం ఎదుట డైరెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ ఆసుపత్రి కళాశాలలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల పై డైరెక్టర్ నిరసిస్తూ ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. గతంలో పనిచేసిన ఒక ఉద్యోగి మరణించడంతో ఆయన కుమారునికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కళాశాల ప్రారంభమైనప్పటి నుండి ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రోస్టర్ పద్ధతిలో ఆర్డర్లు లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.