12న టిఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):ఈనెల 12న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(టిఈఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు లోని స్టేట్ ఆఫీస్  బసిర్భాగ్ నందు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమార్ స్వామి, రాష్ట్ర కన్వీనర్ సుదర్శన్ గౌడ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం నికి రాష్ట్ర ఉద్యోగులకు రావలసిన పిఆర్సి డీజే ల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన జరుగుతోందని వారు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.