కిడ్నీ సెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి)‌: మాదాపూర్‌లోని సైబర్‌టవర్‌ సమీపంలో ఏఐఎన్‌యూ (ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెప్రాలజీ, యూరోలజీ) కిడ్నీ సెంటర్‌ను ఆదివారం సీపీ సజ్జనార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మూత్రపిండాల సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. కిడ్నీ సంబంధిత రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఏఐఎన్‌యూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏఐఎన్‌యూ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ ఇతర వైద్యశాలలతో పోలిస్తే అతితక్కువ ధరలకే కిడ్నీ సంబంధిత సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఏఐఎన్‌యూ కిడ్నీ సెంటర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. హైటెక్‌ సిటీలో ఏర్పాటు చేసిన నూతన శాఖలో ప్రస్తుతం 50 పడుకలున్నాయని.. మున్ముందు వాటిని పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూర్ణచంద్రారెడ్డిలతో పాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.