రోగనిరోధక శక్తి పెంపులో ఆయుర్వేదం కీలకపాత్ర

 



  • మార్గదర్శకాలు విడుదల చేసిన ఆయుష్‌ మంత్రిత్వశాఖ


హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి):  కరోనాచలికి ఎక్కువగా  విజృంభిచె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి... ఈ నేపద్యంలో  అందరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని, ఈ దిశగా ఆయుర్వేదంతో రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెరుగుతుందని దీనితో మంచి ఫలితాన్ని ఇస్తుందని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఇటివల  పేర్కొంది. ఈ మేరకు కొవిడ్‌, పోస్టు కొవిడ్‌లో ఆయుర్వేద మందుల వాడకంపై బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శకాలను పాటించినట్లయితే మంచి పలితాలు పొందవచని , అందుకు ప్రతిఒక్కరు పాటించాలని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది


మార్గదర్శకాలు ఇవీ..



  • యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. వేడి నీళ్లలో కొంచెం పసుపు వేసుకొని రోజుకు ఒకటి నుంచి రెండు సార్లు తాగాలి.

  • దగ్గు ఎక్కువగా ఉంటే.. కొంచెం లవంగం పొడిని బెల్లం లేదా తేనెలో కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి.

  • తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, పొడి అల్లం, ఎండుద్రాక్షతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి.

  • వైద్యుల సూచన మేరకు ఆయుష్‌ క్వాత్‌ (150 మి.లీ 1 కప్పు), సంశమణి వతి రోజుకు రెండుసార్లు 500 మి.గ్రా లేదా గిలోయ్‌ పౌడర్‌ 1-3 గ్రా గోరు వెచ్చని నీటిలో కలిపి 15 రోజులు, అశ్వగంధ రోజుకు రెండుసార్లు, 1-3 గ్రా ములేతి పౌడర్‌ (పొడి దగ్గు ఉంటే) గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు (2 టీస్పూన్లు) తీసుకోవాలి.