మంచిర్యాల (ఆరోగ్యజ్యోతి): జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధి గ్రస్తులకు రక్తం అందించడంతో పాటు విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా మరి న్ని సేవలను అందించేందుకు సేకరిం చిన విరాళాలు రూ.3,50,000ల చెక్కును సొసైటీ జిల్లా శాఖ చైర్మన్, రాష్ట్ర నిర్వ హణ కమిటీ సభ్యుడు వ్యానభట్ రాధాకృ ష్ణ కలెక్టర్‌కు అందజేశారు. రెడ్‌క్రాస్ సహకారంతో రక్త నిల్వలను అందుబా టులో ఉంచుతూ అత్యవసర సేవలను కొనసాగించేందుకు వినియోగించడం జరుగుతుందన్నారు.