డిజిటల్‌ దిశగా ‘ఎంజీఎం’


  •  ఒక పేషెంట్‌కు ఒకే ఐడీతో  విభాగాల వారీగా వివరాల నమోదు

  •  సులభతరంగా ల్యాబ్‌,   ఎక్స్‌రే రిపోర్టులు

  •  పైలట్‌ ప్రాజెక్ట్‌గా క్యాజువాలిటీ  విభాగం ఎంపిక

  •  అమలైతే రాష్ట్రంలోనే తొలి డిజిటల్‌  ప్రభుత్వ దవాఖానగా గుర్తింపు


వరంగల్‌  : ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న వరంగల్‌ ఎంజీఎం దవాఖాన లో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా డిజిటల్‌ సేవలను ఎంజీఎంలో సైతం అమలు చేయడాని కి అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న మ్యానువల్‌ రిపోర్టులు, డిజిటల్‌ ఎక్స్‌రే విధానాన్ని మ రింతగా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు. ఎంజీఎంకు వచ్చి న వ్యక్తి రోగ నిర్ధారణ రిపోర్టులు అందించడంలో ఏర్పడుతున్న కాల వ్యవధిని తగ్గించేందుకు అన్ని పరీక్షల రిపోర్టులను వెంటనే సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దీంతో ఒక రోగికి అందించిన వై ద్యం, నిర్వహించిన పరీక్షలు, వాటి నివేదికలను అందరు వైద్యులు చూసే సౌలభ్యం క లుగుతుంది. తద్వారా రోగికి మరింత త్వ రగా వైద్యసేవలు అందించడానికి అవకాశం కలుగుతుంది. కాగా, క్యాజువాలిటీ విభాగా న్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టడానికి ఎంజీఎం ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.


ఒక పేషెంట్‌కు ఒకే ఐడీ నంబర్‌..


మొదటి సారి వైద్యసేవలు పొందడానికి వచ్చిన ఒక రోగికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయిస్తారు. ఆ రోగికి అందించిన వైద్యం, చేసి న రోగ నిర్ధారణ పరీక్షలు, అందించిన ఔషధాలు తదితర వివరాలు విభాగాల వారీగా నమోదు చేస్తారు. తిరిగి అదే వ్యక్తి వైద్యసేవలు పొందడానికి వచ్చిన సమయంలో ఐడీ నంబర్‌ ఆధారంగా గతంలో అందిన వైద్యం, నిర్వహించిన పరీక్షల వివరాలు తెలుస్తాయి. దీంతో తక్కువ సమయంలోనే రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అంచనా వేసి మెరుగైన వైద్యం అందించడానికి వీలవుతుంది. ఒకవేళ రోగి పొందిన వైద్యసేవల వివరాలు అత డి వద్ద అందుబాటులో లేకున్నా ఎంజీఎం రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటాయి.


అన్ని విధాలా సౌకర్యమే..


ఎంజీఎంలో డిజిటల్‌ ఎక్స్‌ రే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ఎక్స్‌రే ప్రింట్‌ తీ యలేకపోతే క్యాజువాలిటీలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆ విభాగానికి వెళ్లి పరీక్షించాల్సి వస్తుంది. రక్త, మూత్ర తదితర పరీక్షల రిపోర్టుల కోసం రోగులు వేచి ఉండాల్సి వ స్తున్నది. దీనిని నివారించడానికి ఒక రోగిని ఎక్స్‌రే తీసిన వెంటనే దాన్ని పేషెంట్‌ ఐడీ నంబర్‌లో నమోదు చేస్తారు. అదే విధంగా  రోగి తన నమోనాలు ల్యాబ్‌ టెక్నీషియన్‌కు అందించిన వెంటనే తిరిగి సంబందిత వైద్యవిభాగానికి వెళ్లిపోవచ్చు. ల్యాబ్‌ పరీక్షలు ని ర్వహించిన టెక్నీషియన్‌ నివేదికను సంబంధిత రోగి ఐడీ నంబర్‌లో నమోదు చేస్తారు. సంబంధిత విభాగ వైద్యులు నివేదికను వారి వారి విభాగాల్లో చూడవచ్చు. 


పైలట్‌ ప్రాజెక్టుగా క్యాజువాలిటీ..


మొదట క్యాజువాలిటీ విభాగాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ విభాగంలో డిజిటల్‌ సేవలు విజయవంతమైతే మరిన్ని విభాగాలకు ఈ విధానాన్ని అందుబాటులో కి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు.


ఆచరణలోకి తీసుకువస్తాం..


- ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి


ఎంజీఎంలో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ విధానంలో రోగి పూర్తి ఆరోగ్యస్థితి, పరీక్షల నివేదికలు రికార్డు రూపంలో నిక్షిప్తం చేయబడతాయి. దాని మూలంగా అన్ని విభాగాలకు సంబంధించిన నివేదికలను వైద్యులు ఒకే చోట నుంచి తెలుసుకునే వీలు కలుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి వైద్యసేవలు అందించవచ్చు. ప్రస్తుతం చాలా మంది రోగులు పాత రిపోర్టులు తీసుకురాకపోవడంతో వైద్యు లకు అవగాహన ఉండడం లేదు. రికార్డుల్లో నమోదు కావడం వల్ల వైద్యులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.