కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్యపరంగా ప్రపంచంలోనే భారత్ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 95.12 శాతానికి పెరిగిందని వెల్లడించింది. మంగళవారం నాటికి మొత్తం 94,22,636 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,39,820 మాత్రమే ఉన్నాయి. మంగళవారం కొత్తగా 22,065 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒకరోజులో ఇంత తక్కువగా మోదవటం జూలై 7 తర్వాత ఇదే మొదటిసారి.