ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌

 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఎగ్జిబిషన్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడింది.  సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా నెల్లి వినయ్‌కుమార్‌, సెక్రటరీగా డాక్టర్‌ బి. ప్రభాశంకర్‌, జాయింట్‌ సెక్రటరీగా కె. జానకీరాం, కోశాధికారిగా బి. హన్మంతరావు, మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా ఆదిత్య మార్గం, చేతన్‌ ఆనంద్‌, పీఈ దేవదత్‌, ఇ. రాజేంద్రనగర్‌, వనం సురేందర్‌, డివి హన్మంతరావు, నేతుల వినయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఎగ్జిబిషన్‌ సొసైటీ సభ్యులు అభినందించారు.