కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
- - రాష్ట్ర అద్యక్షుడు K. సాయిరెడ్డి
క కరీంనగర్, (ఆరోగ్యజ్యోతి):
తెలంగాణ లో పనిచేస్తున్న మెడికల్ పారామెడికల్ సిబ్బంది యొక్క సమస్యలను ప్రభుత్వం
వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంగం ( H-1
)కరీంనగర్ జిల్లా సమావేశానికి రాష్ట్ర అద్యక్షుడు K. సాయిరెడ్డి
పాల్గొని మాట్లాడుతూ క్రింది డిమాండ్ లను ప్రభుత్వాన్ని కోరినారు. శుక్రవారం
కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారని
ప్రభుత్వం వారికి రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు .అలాగే పెండింగ్లో ఉన్న
పిఆర్సి వెంటనే అమలు చేయాలని,దీనితో పాటు రెండు DA లు
విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.ఆశ కార్యకర్తలకు,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఇన్సూరెన్స్ సౌకర్యం
కల్పించలన్నారు. బ్లడ్ బ్యాంక్ & బ్లడ్
స్టోరేజ్ సెంటర్స్ ఉద్యోగులకు పోస్ట్ శాంక్షన్ చెసి 6 నెలల జీతం వెంటనే చెల్లించాలని అయన డిమాండ్ చేసినారు.కరొన విధులు
నిర్వర్తించే సిబ్బందికి CM KCR ఇచ్చిన
ప్రకారం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని
కోరినారు.ఇవ్వాలి CPS విధానం
రద్దు చేశి పాత పెంక్షన్ విధానం అమలు చేయాలని, కాలిగా
ఉన్న పోస్ట్ లను రెగ్యులర్ విధానంలో బర్థి చేయాలని అన్నారు.రెగ్యులర్ కాంట్రాక్ట్
ఔట్ సోర్సింగ్ సిబ్బంది కి ప్రతినెల 1 వ తారీకు వేతనాలు చెల్లించే విదంగా ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ విడుదల చేసిన జీవో పైన
హై కోర్టు లో ఉన్న కేసు ను వెంటనే పరిష్కరించాలి.ఈ సమావేశం లొ జిల్లా అధ్యక్షుడు
ఆఫ్తాబ్ ఆహెమ్మద్ ఖాన్, రాష్ట్ర
అసోసియేట్ ప్రెసిడెంట్ N శ్రీనివాస్
కర్ణ, రాష్ట్ర వైస్
ప్రెసిడెంట్ V చెంద్ర
మౌళి, TVVP జిల్లా అధ్యక్షుడు T. రవీందర్, రాష్ట్ర
బ్లడ్ బ్యాంక్స్ అద్యక్షుడు రఫీ మొహమ్మద్, జిల్లా
ట్రెజర్ M చేంద్రమౌలి, ఆఫీస్
సబార్డినెంట్ జిల్లా అధ్యక్షుడు M నర్సింగరావు,MD అజీజ్,
MD ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
-