భారీగా తగ్గిన వింత వ్యాధి కేసులు

 

పశ్చిమగోదావరి (ఆరోగ్యజ్యోతి):  ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నాయి. వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని‌ భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. వింత వ్యాధితో చనిపోయినట్లు వచ్చే వదంతులను నమ్మ వద్దని సీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడకు నిత్యం ఏలూరు నుంచి అనేక ఆరోగ్య సమస్యలతో వస్తుంటారని చెప్పారు. ప్రాణాంతక వ్యాధులతో వచ్చే వారికి, ఫిట్స్​వచ్చే వారికి సంబంధం లేదని పేర్కొన్నారు.