అత్యవసర అంబులెన్స్ ను ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యవసర అంబు లెన్స్ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ అంబులెన్స్ను డొనేట్ చేయడం జరిగిందన్నారు, ఈ అంబులెన్స్ విలువ 20 లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 18, 108 అంబులెన్స్లు 7వాల్ అంబులెన్సులు, 13, 102 ఆంబులెన్స్ లతోపాటు 3 ఎంపీ అంబులెన్స్లు 4 బైక్ అంబులెన్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా జిల్లాలో మరిన్ని సేవలు అందుతాయన్నారు .త్వరలో సైదాపూర్ అంకోలి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రిమ్స్ ఆస్పత్రికి అంబులెన్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు,రోజురోజుకు కరోన  పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మాస్కులు ధరించి నట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆంబులెన్స్ డొనేట్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఈ ఆంబులెన్స్ ద్వారా రకరకాల సేవలు పొందవచ్చు అన్నారు. జిల్లాలో 108. 104 అంబులెన్స్ లు తోపాటు బైక్ కూడా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో గురువారం రోజు 60కి పైగా కరోనా పాజిటివ్ కేసు వచ్చాయని ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు . మాస్కులు ధరించ నట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోకు ప్రేమేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ్ సారథి, అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ మరియు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్, జిల్లా ncd అధికారి డాక్టర్ క్రాంతి, జిల్లా టీవీ నివారణ అధికారి  డాక్టర్ ఈశ్వర్ రాజ్ . డి పి ఎన్ స్వామి,ఏ ఓ విజయ, వేణుగోపాల్ రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి , భండారి కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.