కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
హైదరాబాద్( ఆరోగ్యజ్యోతి): బ్లడ్ బ్యాంక్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆరు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్ 1 యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణాటి సాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 14 ప్రకారం తోటి ఉద్యోగులతో సమానంగా రావలసిన జీతాలు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.దులుపుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సంక్షేమ శాఖ అధికారికి పలు సమస్యలతో కూడినవినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ స్టోరేజ్ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫి,, రామకృష్ణ, వేణు గోపాల్, రాము, ఆంజనేయులు, ప్రమోద్, ధర్మయ్య,తదితరులు పాల్గొన్నారు.