హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డికి
శుక్రవారంనాడు వినతి పత్రం సమర్పించడం
జరిగింది.రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తదితర లో
పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ ల సమస్యలు దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయని .వాటిని పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ హార్ట్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం
ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టాఫ్ నర్స్ యొక్క
సీనియార్టీ లిస్టు తయారు చేయాలని ,స్టాఫ్ నర్స్ నుండి హెడ్ నర్స్ గా ,హెడ్ నర్స్ నుండి గ్రేడ్ 2 నర్సింగ్ సూపర్డెంట్ గా,మరియు గ్రేడ్2 గ్రేడ్ 1 నర్సింగ్ సూపర్నెంట్ గా ప్రమోషన్స్
ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు .అలాగే స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ,వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, ట్రెజరీ ద్వారా
వేతనాలు ,ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన వాళ్ళ సర్వీస్
రెగ్యులర్ చేయాలని తదితర సమస్యలపై డైరెక్టర్ గారితో సుదీర్ఘంగా చర్చించడం
జరిగింది .కోర్టు కేసు వివాదం ఉండడం వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతుందని సూచించారు. మిగతా సమస్యలను
పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ , ఉపాధ్యక్షురాలు వి మరియమ్మ, స్టాఫ్ నర్స్ లు సూర్యాపేట నుండి సునీత మహబూబ్నగర్ నుండి సులోచన, నారాయణపేట నుండి మాణిక్యమ్మ తదితరులు
పాల్గొన్నారు .