జిహెచ్ఎంసి ఎన్నికల విధి నిర్వహణలో మృతిచెందిన ఆశా వర్కర్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

 

వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయి రెడ్డి

హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన ఆశ వర్కర్ సూదిని వినోద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్ 1 యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి కోరారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బేగంపేటలోని వెస్లీ డిగ్రీ పీజీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న వినోద మృతిచెందడంతో ఆమె మీద ఆధారపడిన వారి కుటుంబం విధిన పడింది అని పేర్కొన్నారు. మృతురాలి భర్త వికలాంగుల అయినందున కుటుంబ భారం అంతా ఆమె మీదనే పడేది అని ఎప్పుడు ఆ కుటుంభం వీడి పలు అవ్తుందని, దాంతో వారి ఇద్దరు ఆడపిల్లల భారం మోయలేక వికలాంగుడైన భర్త ఇబ్బందులకు గురి కానున్నారని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన ఆశ వర్కర్ వినోద కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతోపాటు, వికలాంగుడైన ఆమె భర్తకు ఉపాధి కల్పించలన్నారు. ఆమె ఇద్దరు ఆడపిల్లలను ప్రభుత్వమే చదివించాలని కోరినారు. అలాగే ఆమె కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది ఇప్పటికే కరోనా లాంటి వ్యాధుల కు చికిత్సలు అందిస్తూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆశా వర్కర్ వినోద మృతి చెందడం బాధాకరమైన విషయమని తెలిపారు. పారితోషికం  మీద పనిచేసే ఆశ వర్కర్లకు ఎన్నికల డ్యూటీ ల తో పాటు ఇతర పనులు అప్పగించడం పట్ల వారు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యనికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడి ఆందోళన వల్ల నే ఆశావర్కర్ వినోద మృతి చెందిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు