ఖమ్మం హాస్పిటల్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం

   కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు ఐ.ఎఫ్.టి.యు కార్మిక సంఘాల కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేష్ రెడ్డికి బుధవారం నాడు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్, IFTU   రాష్ట్ర కార్యదర్శి సూర్యం ,సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, జిల్లా కార్యదర్శి జి రామయ్య లు తెలిపినారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు భూపాల్, సూర్య మాట్లాడుతూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ సంస్థ కింద 7500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చాలీచాలని జీతాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఆ సమయంలో కూడా కార్మికులు అందరూ కష్టపడి పని చేయడం జరిగిందని ఆయన వారికి గుర్తింపు లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని దీనితో పాటు బకాయిలు చెల్లించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురుమూర్తి రామారావు ఆస్పత్రి వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటరమణ మురళి అశోక్ గోపి నాగమణి అంజలి పద్మ మమత తదితరులు పాల్గొన్నారు.