కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
వరంగల్ (ఆరోగ్యజ్యోతి):
డీ.ఎం.హెచ్.ఓ. ఆఫీసు లో తెలంగాణ మెడికల్
అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ .ఏ. 1926/98 .టీఆర్ఎస్ కెవి . నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన
బూర రవి, స్టేట్ చీఫ్ వైస్
ప్రెసిడెంట్ ఎన్నికైన దామెర పరంజ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భైరపాక శ్రీనివాస్ లను నేషనల్ హెల్త్ మిషన్ కో -
చైర్మన్ రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో అడిషనల్ డి.ఎం.అండ్.హెచ్.ఓ .వరంగల్ అర్బన్
జిల్లా డాక్టర్ మదన్ మోహన్ , జోనల్ మలేరియా ఆఫీసర్
డాక్టర్ వాణిశ్రీ ఆధ్వర్యంలో శాలువా , బోకేల తో ఇద్దరని
ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో ఎన్ .హెచ్. ఎమ్. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్
ఫోరం జాయింట్ సెక్రటరీ ఎకుల చిరంజీవి , ఫిఫ్త్ జోన్
అసోసియేషన్ ప్రెసిడెంట్ దామెర సుదర్శన్ , సబ్యూనిట్ ఆఫీసర్
సిరిమెళ్ళ లింగమూర్తి , కనకరాజు తదితరులు
పాల్గొన్నారు . ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
బూర రవి గారు మాట్లాడుతూ నేను వైద్య
ఆరోగ్య శాఖలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై పోరాటం
చేస్తూ యూనియన్ కోసం పని చేస్తూ అందరి సమస్యల పై పోరాడుతానని చేప్పారు. 2021 నూతన సంవత్సరం కానుకగా పీఆర్సీని వెంటనే
ప్రకటించాలని , పెండింగ్ లో ఉన్న 2 డి.ఏ.లను వెంటనే విడుదల చేయాలని , రెగ్యులర్ ఉద్యోగుల
కొన్ని క్యాడర్ల ఉద్యోగులకు రాని వారికి పదోన్నతులు కల్పించాలనిడిమాండ్ చేసినారు. కాంట్రాక్ట్ అండ్
అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని , ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1న కి వేతనాలు చెల్లించాలని , కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మహిళా ఉద్యోగులకు
వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని తెలిపినారు. అలాగే కరోనా వారియర్స్ కి 10% ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరినారు , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సమన పనికి సమన వేతనం ఇవ్వాలని అయన ప్రభుత్వాన్ని
కోరినారు. కాంట్రాక్ట్ , అవుట్సోర్సింగ్
ఉద్యోగులందరికీ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పోరాడుతానని వారి సమస్యల
గురించి అటు ప్రభుత్వం తో ఇటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపినారు.