రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

    కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

నిజాంసాగర్‌/ పిట్లం : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశాలను సోమవారం నిర్వహించారు. సమావేశాలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. దవాఖానల్లో మందుల కొరత లేకుండా చూడాలని, అత్యవసర సమయాల్లో చిన్నచిన్న పరికరాల కోసం నిధులను వినియోగించుకోవాలని పిట్లం వైద్యాధికారి శివకుమార్‌కు సూచించారు. పిట్లంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా బారిన పడిన వారి కోసం క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించిన ఎంపీపీ కవితా విజయ్‌ను సన్మానించారు. అనంతరం దవాఖానలో రికార్డులను పరిశీలించారు. బిచ్కుంద దవాఖానలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిట్లంలో నిర్వహించిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ విజయలక్ష్మి, విండో చైర్మన్‌ శపథంరెడ్డి, వైద్యసిబ్బంది రోహిత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాగౌడ్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. బిచ్కుందలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ అశోక్‌ పటేల్‌, జడ్పీటీసీ సభ్యురాలు భారతీరాజు, బాలాజీ, సర్పంచ్‌ రేఖ, ఎంపీటీసీ సభ్యురాలు చంద్రకళ, మెడికల్‌ ఆఫీసర్‌ రవిరాజ్‌, సాయిబాబా, ఏఎంసీ చైర్మన్‌ సాయవ్వ పాల్గొన్నారు.