హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
హైదరాబాదులోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పెట్ల బురుజు లో పని చేస్తున్నా స్టాఫ్ నర్స్ లకు ,పేషెంట్ కేర్ సిబ్బందికి అనేక నెలలుగా జీతాలు లేని సమస్య పై వైద్య విద్య
డైరెక్టర్ రమేష్ రెడ్డి ని కలిసి
విజ్ఞప్తి చేసినారు..అలాగే వేతనాలు పెంచాలని పిఎఫ్ , ఈఎస్ఐ లో జరుగుతున్న మోసాలు అరికట్టాలని వినతి పత్రం తెలిపినారు. హైదరాబాద్ పరిధిలోని
గాంధీ హాస్పిటల్ నిలోఫర్
హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్స్ లలో ఎస్ ఎన్సి యు వార్డ్
లో పనిచేస్తున్న
సెక్యూరిటీ గార్డులు ,సబ్ స్టాప్ చాలా తక్కువ వేతనాలతో పని
చేస్తున్నారు .ఎం హెచ్ ఎం ద్వారా
జీతాలు పెంచాలని
విజ్ఞప్తి చేసినారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని
డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాములు యూనియన్నాయకులు జంగయ్య తదితరులతో పాటు వివిధ
హాస్పిటల్స్ లోని కార్మికులు ,ఉద్యోగులంతా పాల్గొన్నారు.