పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి

 

జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్

ఆదిలాబాద్తాంసీ  (ఆరోగ్యజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్ లు  అన్నారు. బుధవారం తాంసీ    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంన్ని అయన పరిశీలించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వ్యాధులు దరిచేరవు అన్నారు. వర్షాకాలం  కావడంవల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి చుట్టు చెత్తాచెదారం ఎక్కడికక్కడ మురుగునీరు చేరటం టైర్లు కూలర్లు వాడుకునే లో నీటి నిల్వ ఉంచడం వల్ల ఈగలుదోమలు చేరి మలేరియాడెంగ్యూ ,డఏరియ  లాంటి వ్యాధులు దరి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్  సంపత్ కుమారి, ఎఎన్ ఎం మేఘ    తదితరులు పాల్గొన్నారు.