ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి) నాణ్యమైన వైద్య సేవలు అందించి వైద్యులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సిక్తా
పట్నాయక్ అన్నారు. మంగళ వారం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం బానోత్‌ను వైద్య సేవలపై అడిగి
తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి తక్షణ
వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పేద ప్రజలకువైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ
ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా ఆసుపత్రుల్లో వైద్యులు ఎళ్లవేళాల విధులు
నిర్వహిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సహకారం అందించాలని సూచించారు. రిమ్స్‌లో
మంజూరైన వైద్యుల పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్‌నెస్
కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పంపిణీ, పనిచేస్తున్న వైద్య సిబ్బంది వివరాలను డ్యూటీ
డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆర్‌ఎంవో డా.చందు, వైద్యులు నరేష్ రాథోడ్, ప్రీతి తదితరులున్నారు.