రవితేజని ఆదుకుంటాం మంత్రి ఈటెల

 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  రవితేజ ని ఆరోగ్యం బాగు పడుతుందని అన్ని విధాల ఆదుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు .వరంగల్, అర్బన్ కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందినా రవితేజ గత కొంత కాలంగా  కిడ్నీ లివర్ ఫంక్షన్ వ్యాధులతో బాధపడుతున్న రవితేజను బుధవారం నాడు మంత్రి ఈటెల రాజేందర్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించినారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్  , రవితేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ రవితేజ కు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని మెరుగైన వైద్య చికిత్స అందించాలని  కిమ్స్ వైదులకు సూచించారు .మంత్రి వెంట పంగిడి పల్లి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.