సామాజిక ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణి

 

కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ఉట్నూర్ ,ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆర్మీ దినోత్సవం సందర్బంగా దేశ రక్షణ చేస్తున్న సైనికులను సేవలను గుర్తిస్తూ, దేశ రక్షణ బాధ్యతలో అసువులు బారిన అమరవీరులకు నివాళి అర్పిస్తూ, నేషనల్ ఆర్మీ డే ను పురస్కరించుకొని  ఉట్నూర్ సామాజిక ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది.యంగ్ లీడర్స్ జేఏసీ ఫౌండర్ కాంబ్లే ప్రజ్ఞాశీల్, యంగ్ లీడర్స్ జేఏసీ మండలం అధ్యక్షులు రాథోడ్ కళ్యాణ్, యంగ్ లీడర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్, వైద్య ఆరోగ్య శాఖ అవుట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర నాయకులు బొంకటి సుభాష్,జాదవ్ బాలరాజ్, డాక్టర్ మహేందర్ గారు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.