కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
మన తెలంగాణ నర్సుకి నేషనల్
ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్
అమె ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవడంలో ఒక దేవత... ఆమె చేసిన సేవలు జిల్లా ,రాష్ట్ర స్థాయి,దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది... ఆమె తెచ్చిన గుర్తింపు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం....విధుల్లో చేరినప్పటి నుండి ఇప్పటివరకు ఆమె చేసిన సేవలు మనం మాటల్లో చెప్పలేము.. జిల్లాస్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్న ఆమె తెలంగాణ లో కూడా ఈ అవార్డును పొందారు ...పేదలకు సేవ చేయడంలో ముందుంటారు.. ఆమెకు తోచిన సలహాలు సూచనలు ఇస్తూ పలువురు అధికారుల నాయకుల ప్రజాప్రతినిధుల అభినందనలు ఎన్నో పొందారు...ఈ అభినందనలతో పాటు తెలంగాణకు కూడా ఆమెన 2020లో గుర్తింపు తెచ్చారు ..అదే గుర్తింపు ఏందంటే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్అవార్డ్ ను ఆమె సొంతం చేసుకున్నారు.. ప్రతి సంవత్సరం మే 12న నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా ఈ అవార్డును దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన నర్సులకు అందజేస్తారు. 2020లో 12 కు సంబంధించిన ఈ అవార్డును ఆమె దక్కించుకుంది. పేదలంటే ఆమెకు పేద రోగులు సేవలు అందించాలంటే మరి సంతోషం. రోజుకో రకం జబ్బులు వస్తున్నాయి. పేద ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ జబ్బుల గురించి వివరిస్తూ ఎప్పటికప్పుడు చికిత్సలు అందించి అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు సంరక్షణ, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసంతదితర అంశాలపై ఆమె ప్రజలను చైతన్య పరుస్తూ వచ్చింది.రూరల్ ఏరియా లో ప్రజలకు సేవ చేయడం ఆమెకు ఎంతో సంతోషకరం.
ఎంత దూరమైనా సరే.. లెక్క చేయకుండా నర్సుగా
పేద ప్రజలకు సేవలు అందించింది. అడుగడుగునా
ఆదర్శంగా నిలిచిన ఈ తెలంగాణ బిడ్డ సేవా ప్రయాణాన్ని గుర్తించిన ప్రభుత్వం… నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎ అరుణను ఎంపిక చేసింది.
ఇప్పుడు
ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్
అత్యున్నతమైన సేవలందించిన నర్సులకు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఇస్తారు. 2020 సంవత్సరానికి తెలంగాణ నుంచి ఈ అవార్డుకు ఇద్దరు నర్సులు
సెలక్ట్ అయ్యారు. మెహదీపట్నంలో పని చేస్తున్న అనపర్తి అరుణకుమారి అవార్డు
అందుకోనుంది. 1998 నుంచి గుడి మల్కాపూర్ , మేదిపట్నం పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం గా
చేరి పనిచేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఆమెను
గుర్తించి పలు రకాల అవార్డులను ప్రధానం చేశారు పేదలకు సేవలందించడంలో ఎప్పటికీ
ముందుండి చేస్తానని పట్టుదలతో ఆమె సేవ చేస్తూ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైంది. మే 12న ఢిల్లీలో రాష్ర్టపతి చేతుల మీదుగా ఈ
అవార్డ్‌తో అందుకోనుంది. ‘‘ఈ అవార్డ్ రావడం మరింత బాధ్యత పెంచింద’’ని అంటోంది అనపర్తి అరుణకుమారి.
అనపర్తి
అరుణకుమారి అవార్డ్ ఇవే
Ø
2020 సంవత్సరంలో
ఉత్తమ ఎంపీఎహ్ (ఎ) అవార్డు జిల్లాస్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్ చేతుల మీదుగా గుడిమల్కాపూర్ ప్రాంత పర్యటనలో
భాగంగా సేవల పనితీరుకు ప్రశంసా పత్రం అందుకున్నారు
Ø
2019లో డాక్టర్
వెంకట్ చేతులమీదుగా అవార్డు తీసుకున్నారు
Ø
2017 ఉత్తమ ఎంపీఎహ్
(ఎ) అవార్డు జిల్లాస్థాయిలో అప్పటి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ద్వారా ప్రశంసా
పత్రం తీసుకున్నారు
Ø
2011 ఉత్తమ
రికార్డుల నమోదుకు జిల్లా స్థాయిలో అప్పటి జిల్లా కలెక్టర్ నటరాజ్ ద్వారా ప్రశంసా
పత్రం అందుకున్నారు
Ø
2008లో ఉత్తమ ఎంపీఎహ్
(ఎ) అవార్డు జిల్లాస్థాయిలో అప్పటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయ
కుమారి ద్వారా ప్రశంసాపత్రాలు అందుకున్నారు
Ø
2008 జూలై 11వ
డాక్టర్ విజయ కుమారి చేతులమీదుగా రెండు వేల రూపాయల నగదును పొందారు. 2017 లో
డాక్టర్ పద్మజా చేతులమీదుగా అవార్డు పొందారు
Ø
2003 లో ఉత్తమ ఎంపీఎహ్
(ఎ) అవార్డు జిల్లాస్థాయిలో అప్పటి జిల్లా కలెక్టర్ రాజేశ్వర్ తివారీ చేతులమీదుగా
రెండు వేల రూపాయల నగదు బహుమతి గోడ గడియారం అందుకున్నారు
Ø
2002లో అప్పటి
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ద్వారా ఉత్తమ ఎంపీఎహ్ (ఎ) అవార్డు
ఎల్.బి.స్టేడియంలో అందుకున్నారు
Ø
2001 లో ఉత్తమ ఎంపీఎహ్
(ఎ) అవార్డు జిల్లాస్థాయిలో అప్పటి జిల్లా కలెక్టర్ రాజేశ్వరి వారి చేతులమీదుగా
అవార్డు పొందారు
అవార్డు రావడం తో
బాధ్యత పెరిగింది
- ఎ అరుణ , (ఆరోగ్య కార్యకర్త)
ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు రావడంతో
బాధ్యత మరింత పెరిగింది.ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు వైద్య సేవలు
అందించడంలో మున్డున్నాను, ఎప్పుడు కూడా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తన
వంతుగా కృషి చేస్తానని అంటుంది . ఎ అరుణ
ఆరోగ్య
కార్యకర్త. ప్రజలకు సేవలందించడంలో ఎప్పుడూ ముందు ఉంటానని ఈ సందర్భంగా ఆరోగ్యజ్యోతి
ఆమె తెలియజేశారు.