ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

   కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

హైదరాబాదు, (ఆరోగ్యజ్యోతి):వేతనాల పెరుగుదల స్లాబ్ విధానంగా కాకుండా రెగ్యులర్ బేసిక్ ఆధారంగా ప్రతీ క్యాడర్ వాళ్లకి వేతనాలు పీంచాలని పెంచాలని, తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. సంఘ నాయకులతో కలసి గురువారం నాడు  పి ఆర్ సి   కమీషన్ కి బిఅర్కే  భవన్ లో మన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పలు సమస్యలపై నివేదికను ఇవ్వడం జరిగింది.విలేకర్లతో మాట్లాడుతూ  ఏజెన్సీ విధానాన్ని ఎత్తివేయాలని, సీనియారిటీని బట్టి సంవత్సరానికి 10 శాతం ఇంక్రిమెంటు ఇవ్వాలని, EPF యాజమాన్య కోటా 15 శాతానికి పెంచాలని నివేదికలో పొందపర్చడం జరిగిందన్నారు.  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు కోరారు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు 35 సెలవులు ఇవ్వాలన్నారు సీనియార్టీ ప్రకారం ఇంక్రిమెంట్ పెంచాలని డిమాండ్ చేశారు జమ చేయడంలో 15 శాతం పెంచాలన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు కోరారుఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి . బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫియొద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ సుభాష్, జాయింట్ సెక్రటరీ నర్సింహులు, బ్లడ్ బ్యాంక్ వింగ్ కనకచంద్రం, రాష్ట్ర నాయకులు సిరాజుద్దీన్, శ్రీకాంత్   తదితరులు పాల్గొన్నారు.