కడుపు నిండా వెంట్రుకలే..!

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

నిర్మల్‌ జిల్లాకేంద్రంలో అరుదైన ఆపరేషన్‌

నిర్మల్ (ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి (23) మానసిక ఆందోళనతో వెంట్రుకలు తినే అలవాటుకు లోనైంది. రెండేళ్లకు పైగా కావడంతో ఆమెకు క్రమంగా అనారోగ్య సమస్య లు తలెత్తాయి. ఇదేక్రమంలో మంగళవారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి  రావడంతో యువతిని స్థానిక ప్రశాంత్‌ జీకే ఆసుపత్రి తరలించారు. ఆమె కడుపులో భారీ వెంట్రుకల మూట జమైందని, సుమారు రెండున్నర కిలోలకు పైగా వెంట్రుకల ముద్ద చిన్నపేగులో (ట్రైకోడిజార్‌) కూడుకుపోయిం దని వైద్యులు గుర్తించారు. దీంతో డాక్టర్‌ ప్రశాంత్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆపరేషన్‌ చేసి ఆ వెంట్రుకల ముద్దను తొలగించారు. మీటరున్నరకుపైగా పొడవు, రెండున్నర కిలోలకు పైగా ఉన్న వెంట్రుకల ముద్ద బయటపడడం గమనార్హం. ఇది అత్యంత అరుదైన ఆపరేషన్‌గా వైద్య బృందం తెలిపింది. డాక్టర్‌ ప్రశాంత్‌ను స్థానిక వైద్యులు, ఐఎంఏ అభినందించింది. భాధితురాలి తల్లిదండ్రులు దీర్ఘకాలంగా తమ బిడ్డ పడుతున్న బాద నుంచి ఉపశమనం పొందడంతో సంతోషం వ్యక్తం చేశారు.