ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

 కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):  కరోనా సమయంలోనూ రెగ్యలర్ వైద్య ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించి తమవంతు బాధ్యతను నిర్వర్తించిన రిమ్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. తమ వేతన సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని రిమ్స్ ఎదుట చేపట్టిన సమ్మెకు బుధవారం మద్దతు తెలిపారు. అంతకుముందు రిమ్స్ ఆస్పత్రి నుండి ర్యాలీగా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి, వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు రాక కార్మికులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, మల్లేష్ యాదవ్ ,రాజు యాదవ్, సృజన్ రెడ్డి,రూపేష్ రెడ్డి, రిమ్స్ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ నాయకులు బండ్ల శ్రీనివాస్, సఖి ఉద్దీన్ తదితరులు ఉన్నారు.