కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
జిల్లా కలెక్టర్ వరంగల్ అర్బన్ రాజీవ్ గాంధీ హనుమంతు
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): జనవరి నెలలో
మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు అందరు 29 రోజుల రెండో విడత తప్పనిసరిగా
తీసుకోవాలని అప్పుడే వారికి కోవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని జిల్లా
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు .గురువారం నాడు కలెక్టర్ కాన్ఫరెన్స్
హాల్లో రెండో విడత కోవిడ్ పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్న ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది,
అంగన్వాడీ కార్యకర్తలు, వారికి ఫిబ్రవరి 13 శనివారం రోజున ఇవ్వడం జరుగుతుందన్నారు.
జనవరి 18న వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 15వ తేదీన జనవరి 19 తేదీన,
వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 16న జనవరి 21న వ్యాక్సిన్ తీసుకున్నవారికి
ఫిబ్రవరి 18న జనవరి 22న వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫిబ్రవరి 19న వారు తీసుకున్న
సెంటర్లోని వ్యాక్సిన్ రెండవ విడత ఇవ్వడం జరుగుతుందన్నారు .వ్యాక్సిన్ తీసుకున్నవారికి
మాత్రమే రెండోది ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు .తేదీలలో తప్పనిసరి
రెండో తీసుకోవాలని తెలిపారు .ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్
లలితాదేవి ఎంజీఎం సూపర్డెంట్ డాక్టర్ కె నాగార్జున రెడ్డి కె ఎం సి ప్రిన్సిపాల్
డాక్టర్ సంధ్య జిల్లా సంక్షేమ అధికారి శారద, సి కె ఎం సూపరిండెంట్ డాక్టర్ టి నిర్మల కుమారి , జి ఎన్ హెచ్ సూపరిండెంట్ డాక్టర్ సరళాదేవి, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్
రావు డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎండి యాకుబ్ పాశ, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ పి ఎస్ మల్లికార్జున్
, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్
గీతాలక్ష్మి, డాక్టర్ సురేష్ మాస్ మీడియా అధికారి బి అశోక్
రెడ్డి తదితరులు పాల్గొన్నారు.