తాను పోతూ.. మరెందరికో వెలుగునిచ్చి..

        కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

  • విశాల హృదయంతో అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు
  • జీవన్‌ దాన్‌ సంస్థ ద్వారా అందుబాటులో ఎనిమిది అవయవాలు
  • తాను మరణిస్తూ మరి కొందరికి జీవం పోసిన వరకాంతం నర్సిరెడ్డి

 

 

బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్న నర్సారెడ్డి కాపాడుకునేందుకు ఆ కుటుంబం ఎంతగానో ప్రయత్నించింది మొక్కని దేవుడు లేడు చూపించండి డాక్టర్ లేరు కానీ అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పారు బ్రెయిన్డెడ్ అయిందని ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు కుటుంబ సభ్యులతో పాటు బ్రెయిన్డెడ్ అయిన విషయాన్ని సంస్థకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు ఐ టి ఐ కుటుంబ సభ్యులతో విషయం స్పష్టంగా చెప్పిన వైద్యులు ఎల్బినగర్ కామినేని ఆస్పత్రికి సంస్థ సభ్యులు చేరుకొని బ్రెయిన్డెడ్ అయిన విషయాన్ని స్పష్టంగా కుటుంబ సభ్యులందరికీ వివరించారు అయితే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కి సంబంధించిన అవయవాలు దానం చేస్తే మరికొందరికి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పనికి పనిచేస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరూ వారు చెప్పిన విషయానికి అంగీకరించారు... కిడ్నీలను మరొకరికి అమర్చి ప్రాణాపాయం నుంచి కాపాడారు. లివర్ మరొకరికి, కారేటజ్ మరొకరికి దానం చేయడం ద్వారా ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన ఘనుడిగా నర్సిరెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. దీంతో నర్సిరెడ్డి కుటుంబ సభ్యులకు పలువురు హాట్సాఫ్ చెబుతున్నారు....

హైదరాబాద్,మన్సురాబాద్(ఆరోగ్యజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోత్కూరు మండలం ఆరెగూడెం కి చెందిన పరకాంత నర్సారెడ్డి 45 వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఆయన భార్య నిర్మల శశిధర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి లు వారి కుటుంబం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం కానీ ఇటీవల ఒక ప్రైవేటు లో పనిచేస్తున్నారు జనవరి 31న తన బైక్ లో పెట్రోల్ పోసుకొని మోత్కూరు ఊరు వెళ్ళాడు అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలో కి వెళ్లడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు అక్కడి వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు కామినేని ఆసుపత్రిలో చేర్పించగా హైబీపీతో మెదడులోని రక్తనాళాలు చిట్లి పోయినట్లుగా వైద్యులు అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నర్సారెడ్డి ఈ నెల ఒకటో తేదీ మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి పరీక్షించిన కామినేని వైద్యులు బ్రెయిన్డెడ్ అయినట్లు గుర్తించారు వెంటనే ఈ కుటుంబం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు జీవన్ సంస్థ సభ్యులకు చెప్పి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని సూచనలు ఇచ్చారు వెంటనే జీవన్ సంస్థ సభ్యులు కామినేని ఆస్పత్రి ఎల్బీనగర్ కు చేరుకొని నరసారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్తి వివరించారు. నర్సారెడ్డి కి సంబంధించిన అవ్వాలని దానం చేసినట్లయితే తన అవయవాలు పదిమందికి ఉపయోగపడతాయని తెలిపారు మధ్యాహ్నం రెండు అయిన నర్సారెడ్డి దేహంలోని గుండె ఊపిరితిత్తులు లివర్ కిడ్నీలు సేకరించారు. డాక్టర్ గోకలే బృందం ఆధ్వర్యంలో శరీర భాగం నుండి అవయవాలు సేకరిం చారు వెంటనే గుండెను మెట్రో రైలు తరలించిచారు. తాను పోతూ పదిమందికి ప్రాణదానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఇప్పటివరకు మనం చాలా మంది అతను చనిపోతూ కంటి దానం చేస్తానని చెప్పడం దానం చేయడం జరిగింది చాలా తక్కువ మంది తన శరీరంలోని అవయవ దానం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు చాలా తక్కువ మంది మాత్రం అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇందులో ఇటీవల బ్రెయిన్ డెడ్ అయిన నర్సారెడ్డి కి సంబంధించిన అవయవాలు దానం చేశారు...