కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
- జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.
నిర్మల్(ఆరోగ్యజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల పై సంబంధిత వైద్యులు, అధికారులతో వేరు వేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులలో 50శాతం సాధారణ ప్రసవాలు కచ్చితంగా జరగాలన్నారు. గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ధన్ రాజ్, డాక్టర్లు రజిని, కార్తీక్,అవినాష్,ఆశిష్ రెడ్డి, వేణుగోపాల్, సుభాష్, సరోజ, స్వర్ణ రెడ్డి,లక్ష్మి చైతన్య వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.