కొవిడ్‌ టీకాను తీసుకోన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

వరంగల్, (ఆరోగ్యజ్యోతి): హన్మకొండ లోని వడ్డేపల్లి లో బుధవారం నాడు కోవిద్  వ్యాక్సిన్ టీకాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత ప్రారంభించారు ముందుగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి  కి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వయంగా టికా ఇచ్చారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది శానిటరీ, ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ కార్మికులు ,వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది టీకాలు వేశారు ,ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కోవిద్  వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో వస్తున్న అపోహలను  ఎవరు నమ్మవద్దని కరోనా వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్నారు .తీసుకున్నట్లయితే ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అపోహలను ఎవరు నమ్మవద్దని సూచించారు .ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి వైద్య అధికారి డాక్టర్ మల్లిక, ఫార్మసిస్ట్ అనూష, సూపర్వైజర్ సురేందర్, స్టాఫ్ నర్స్ ఉమారాణి, పి హెచ్ ఎం మానస, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, అకౌంటెంట్ మంజుల, ఏఎన్ఎంలు పద్మ, వసంత ,రూపాలత  తో పాటు  ఆశా కార్యకర్తలు, వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.