కొవిడ్‌ టీకాను ప్రతి ఒక్కరు తీసుకోవాలి

       కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

వరంగల్, (ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌ టీకా చాలా సురక్షితమైందని చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ , డాక్టర్ శ్రీ దేవి అన్నారు. చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుదవారంనాడు సానిటరీ సూపర్వైసర్  సాంబయ్య , సానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి , జవాన్లు అమర సింగ్ ఠాగూర్ , పీ. సుజాత మరియు మునిసిపల్  సిబంద్ధికి చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కొరోన -19 కోవాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో భయాలు, అపోహలు పడవద్దని  అన్నారు  తొలిదశలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని వారు  అన్నారు. ఈ కార్యక్రమాల్లో సూపర్వైజర్  తేజావత్ రవీందర్ , పీ.ఎచ్.ఎమ్. డీ.మోహనరావు , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎమ్.లు శ్రీలత , ప్రేమలత , పెనిన్నా , ఆశ వర్కర్స్ , శోభ , సుమలత , మాలతీ , రజిత , చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.