కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
ఎలాంటి భయం అవసరం
లేదు
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 41,595 మందికి టీకాలు
జిల్లా వైద్యా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కరోనా నివారణ టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. మొదట ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు పంపిణీ చేయగా.. ఈనెల 1 నుంచి 60 ఏండ్లు దాటిన వారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఇస్తున్నామని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌ఆరోగ్యజ్యోతితో తెలిపినారు. వ్యాక్సిన్ ప్రారంభంలో ప్రజలు కొంత ఆందోళన చెందిన మాట వాస్తవమే. తదానంతరం టీకా తీసుకున్న వా రికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకపోవడంతో వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజూ 2,000 నుంచి 2,500 మందికి వైద్యశాఖ అధికారులు టీకా వేస్తున్నారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బీపీ, షుగర్, ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా టీకా తీసుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారని ఈ సందర్భంగా అయన తెలిపినారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 41,595 మందికి వైద్యశాఖ సిబ్బందిన టీకా ఇవ్వడం జరిగిందని అందులో ఆదిలాబాద్ జిల్లాలో 12,649 మంది, మంచిర్యాలలో 12,5 86, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 4,652, నిర్మల్‌లో 11,708 మంది తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మొదటి విడుత టీకా పంపిణీ పూర్తిచేయడం జరిగిందన్నారు. వైద్య, పోలీసు, పారిశుధ్య, అంగన్‌వాడీ సిబ్బందికి రెండు విడుతలుగా పంపిణీ చేశామణి తెలిపినారు. ఈ నెల 1 నుంచి రెండో విడుత పంపిణీ ప్రారంభం కాగా.. అర్హులైన వారందరూ తీసుకోవాలని టికా తీసుకోవాలని అయన కోరినారు. ఉమ్మడి జిల్లాలోని 12 కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుదన్నారు. 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏండ్లు దాటిన వారు cowin.gov.in వివరాలు అందించాలని తెలిపినారు. ఫోన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.