వేగంతో స్పందించి ఒకరి ప్రాణాలు కాపాడిన వాంకిడి కానిస్టేబుల్ శేషారావ్..



  అసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి): వాంకిడి మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా  చిక్లి వాగు పై ఉన్నటువంటి పాత వంతెనపై ఎయిర్టెల్ కు సంబంధించిన కార్మికులు  ఎయిర్టెల్ కేబుల్ ను తొలగించే క్రమంలో  ప్రమాదవశాత్తు  వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెన పైన కేబుల్ ను తొలగిస్తున్న కార్మికులు ఒక్కసారిగా గా కింద పోవడంతో  శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులనుఅటువైపు వెళ్తున్న  కానిస్టేబుల్ శేషారావు వెంటనే స్పందించి .మెరుపు వేగంతో ఇరుక్కున్న ఒక క్షతగాత్రుడిని బయటకు లాగి ప్రాణాలను కాపాడారు...వెంటనే వాంకిడి ఎస్సై డికొండా రమేష్ కు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని  అక్కడ పూర్తిగా శితిలాల కిందా  చిక్కుకున్న వాళ్ళను గుర్తించి ప్రాణాలతో బయటికి తీసే ప్రయత్నం చేసినా...అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించి బయటికి వెలికి తీసి పోస్టుమార్టం కొరకు అసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సహాయంతో గాయాలపాలైన ఒక కార్మికుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడిన శేషారావ్ కానిస్టేబుల్ ను అసిఫాబాద్ ఇంచార్జి అడిషనల్ ఎస్పి, అసిఫాబాద్ డిఎస్పీ అచ్ఛేశ్వర్ రావ్,వాంకిడి సి.ఐ సుధాకర్ అభినందించారు.