గుంటూరు,(ఆరోగ్యజ్యోతి):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.