కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
సూర్యాపేట,(ఆరోగ్యజ్యోతి):
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంబించి 6 జూన్ 2021 వరకు మన సూర్యాపేట జిల్లాలో వంద
రోజుల పూర్తి ఐనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోట చలం, జిల్లావ్యాధి
నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపినారు.రాష్ట్ర విద్యుత్ శాఖ
మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణ రెడ్డి ఆదేశాలతో
పూర్తి చేసినామన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన సూర్యాపేట జిల్లాలో పనిచేయుచున్న
వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి,వివిధ శాఖల అధికారులకు ,ప్రజాప్రతినిధులకు,పత్రిక మిత్రులకు ,సూర్యాపేట జిల్లా ప్రజలకు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు , అనది కారులకు జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపినారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోట
చలం, జిల్లావ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ వారు మాట్లాడుతూ
వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన వారందరూ ముందుకు రావాలని తెలిపారు వ్యాక్సిన్
దశలవారీగా ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన వారందరికీ పంపిణీ
చేస్తున్నామన్నారు ప్రస్తుతం కొన్ని పిఎస్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం
జరిగిందని తెలిపారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నియమ నిబంధనల ప్రకారం
ఇవ్వడం జరుగుతుందన్నారు వ్యాఖ్యలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు.