రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేయండి

 

జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్

 ఆదిలాబాద్,(ఆరోగ్యజోతి): రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ వైద్య అధికారులకు ఆదేశించారు .మంగళవారం రోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఆవరణలో గల తెలంగాణ రోగనిర్ధారణ పరీక్ష కేంద్రం కలెక్టర్ పరిశీలించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రోజు వారి సామర్థ్యం పనితీరు పరీక్షకు సంబంధించిన రిపోర్టులు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .నిర్ధారణ కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగారు రోగనిర్ధారణ పరీక్ష పరికరాలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం కొత్తగా నిర్మించే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణ పనులను పరిశీలించారు .సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్, జిల్లాఅదనపు  వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాదన  రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం, మున్సిపల్ కమిషనర్ శైలజ, టి ఎస్ ఎం    డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్ , ఆరోగ్య శాఖ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.