రాష్ట్ర వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

జగిత్యాల(ఆరోగ్యజ్యోతి) :  జిల్లాలో పనిచేస్తున్న మెడికల్ పార మెడికల్ సిబ్బంది కేంద్ర రాష్ట్రాల వవిద పథకాల లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను  ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ కి  వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తన చాంబర్లో సోమవారంనాడు  వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ నవీన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీపతి  మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని అన్నిరకాల క్యాడర్స్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే వ్యాక్సినేషన్ చేయాలని కోరినారు.       కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్తో కూడిన 10% బెడ్స్ ప్రత్యేకంగా కేటాయించే విధంగా చర్యలు తీసుకోవలని అన్నరు,  కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబ సభ్యులకు జిల్లా కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు కోరినారు.   కరోనా బారిన పడి మృతి చెందిన వారికి కేంద్రం ఇచ్చే రూ 50లక్షల ఇన్సూరెన్స్తో పాటు రాష్ట్ర కేంద్రం కూడా రూ 50 లక్షలు ఎక్స్ప్రెషియా ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులలో అర్హతను బట్టి చనిపోయిన ఉగ్యోగి స్థాయికి తగ్గకుండా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసినారు.     కరోనా ఇన్సెంటీవ్ 2020 ఏప్రిల్ మే నెలలు మాత్రమే 10% ఇచ్చారు. ఆ తరువాత కాలంలో ఇవ్వలేదు. దానిని కొనసాగించి వైద్య ఆరోగ్య ఉద్యోగులందరికీ ఇవ్వాలని కోరినారు.    ఈ కార్యక్రమంలో హెచ్ ఏ ఓ ఓ రాజేశం, శారద, మహేశ్వరి, లక్ష్మీకాంత, ఊర్మిళ, లతా, బాబాయ్ ,స్వరూప, స్వరూప, విజయ, రాజేశ్వరి మెడికల్ పార మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.