ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

       కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

మదనపూర్, వనపర్తి(ఆరోగ్యజ్యోతి):  వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్, కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని మదనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సిబ్బంది పై వివక్ష చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వేతనాలు పెంచారని నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం వేతనాలు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్కీం లో  అయినప్పటికీ పనిచేసిది రాష్ట్రంలోనేనని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు జ్యోతి, సువర్ణ ,ల్యాబ్ టెక్నీషియన్ మోహన్, ఫార్మసిస్ట్ శిల్ప ,ఏఎన్ఎం లు కే. లక్ష్మమ్మ, శ్రీదేవి, అలివేలు, నర్మదా డిఈఓ విజయ్ కుమార్, సిబ్బంది  అంజమ్మ,శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.