కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
-
ప్రభుత్వానికి ఐక్య వేదిక ప్రతినిదులు
హైదరాబాద్,ఆరోగ్యజ్యోతి):ప్రభుత్వం ప్రకటించిన
పి ఆర్ సి లో జీవో నెంబర్ 60 ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీరని
అన్యాయం జరుగుతుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఐక్యవేదిక ప్రతినిధులు డాక్టర్ రవి శంకర్ కర్నాటి సాయి రెడ్డి ,డాక్టర్ కత్తి జనార్ధన్,భూపాల్ లు ఆవేదన వ్యక్తం చేశారు .నేషనల్ హెల్త్
స్కీమ్ లో పనిచేస్తున్న కాంటాక్ట్
ఉద్యోగులందరికీ పి ఆర్ సి అందేలా చూడాలని ప్రభుత్వాన్నివారు కోరినారు.వైద్య ఆరోగ్య
ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మంగళవారం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేషనల్ హెల్త్ మిషన్ ,కాంట్రాక్ట్
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తో పాటు రెగ్యులర్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జి లతో నిరసన
వ్యక్తం చేశారని తెలిపారు.నేషనల్ హెల్త్ మిషన్
కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు
పరిష్కరించాలని,వారి వేతనాలు పెంచాలని కోరారు.
వైద్య సిబ్బంది కుటుంబాలకు కరోనా వ్యాక్సిన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ 50
లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకూడా రూ 50
లక్షల తో పాటు ఎక్సిగ్రేష యా చెల్లించాలని
వారు డిమాండ్ చేసినారు . కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పి ఆర్ సి
లో ఇచ్చిన జీవో 60 ని సవరించి న్యాయం చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ లో నియమితులైన. హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ లను రెగ్యులర్
చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక సభ్యులు ,వీరారెడ్డి, మంచాల
రవి ,రాజశేఖర్, ఆర్
సుజాత శిరీష ,తదితరులు
పాల్గొన్నారు.