భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి):గత కొన్ని
రోజులుగా పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లో
కలుగుతున్న అంతరాయము గురించి విద్యుత్ సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించి
ఎం.ఎల్.ఏ వనమా వెంకటేశ్వరరావు ఆగ్రహం
వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి .చంద్రశేఖర్ రావు కనురెప్ప పాటు
కూడా విధ్యుత్ అంతరాయము కలగవద్దని చెప్పినా పాల్వంచ, కొత్తగూడెం
ప్రాంతాలలో గత కొన్నిరోజులుగా అంతరాయం కలగటం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు
తీసుకోవాలని అధికారులకు ఎం.ఎల్.ఏ వనమా తెలిపారు.ఈ కార్యక్రమం లో విద్యుత్ సరఫరా
అధికారులు DE విజయ్,ADE కొత్తగూడెం
జి.భాస్కర్ రావు, ADE కొత్తగూడెం రూరల్ యాసిన్, ADE పాల్వంచ రెహమతుల్లా హుస్సేన్,
AE పాల్వంచ బుజ్జి
కన్నయ్య, AE పాల్వంచ రూరల్ వెంకటేశ్వర్లు తదితరులు
పాల్గొన్నారు.