కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన సదస్సు
తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ను పరిశీలించిన బృందం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):గర్భిణీ
స్త్రీల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ,వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. సోమవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ అధికారి కార్యాలయం లో ఆర్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో బృందం
పర్యటించింది. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వేల్పార్ ఆదేశాల మేరకు ఈ బృందం అవగాహన సదస్సు
నిర్వహించడం తో పాటు జిల్లాలోని ఉట్నూరు ఆసుపత్రి తో పాటు దంతేనపల్లి ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
అధికారి డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ హైరిస్క్
కేసులపై వైద్య ఆరోగ్య శాఖ తో కలిసి
ఈ సంస్థ పని చేస్తుందన్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద 8 జిల్లాలను ఎంపిక చేశారని ఆదిలాబాద్, ఆసిఫాబాద్,
భద్రాద్రి కొత్తగూడెం ,నల్గొండ ,నాగర్కర్నూల్, సంగారెడ్డి ,వరంగల్ జిల్లాలో
కార్యక్రమం చేపడుతున్నట్లుఅయన తెలిపారు. గర్భిణీ
రక్తహీనత, పౌష్ఠికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు తదితర వాటిపై పరిశీలించి మరణాలు
సంభవించడం మాత శిశు సంరక్షణకు ఈ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
సూపర్వైజర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు డాక్టర్ బువ్వేసి డాక్టర్ రోహిణి
లు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ
సారథి, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
డయాగ్నొస్టిక్ సెంటర్ పరిశీలించిన బృందం
కుటుంబ సంఘ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ
ఆదేశాల మేరకు ఈ బృందం జిల్లాలో పర్యటించింది. రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం
జిల్లాలో పర్యటించి, ఒక బృందం ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా
సోమవారం ఉదయం తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్షన్ స్వచ్ఛంద
సంస్థ డైరెక్టర్ ఎం ఈ డాక్టర్ రజిని డైరెక్టర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చేతన్. లు
కలసి తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ పరిశీలించారు.
ఇందులో ఏరకమైన పరీక్షలు చేస్తున్నారు...
ఎలా చేస్తారు... బ్లడ్ శాంపిల్ ..ఎలా కలెక్షన్ చేస్తారు.. అని డిప్యూటీ
డిఎంఅండ్హెచ్ఓ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ సాదనను అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి అన్ని రకాల
టెస్టులు చేసే సౌకర్యం ఉందని డాక్టర్ సాధన వారికి వివరించారు. కొత్త పరికరం ద్వారా
ఐదు రకాల టెస్టులను కూడా చేసే పరికరం అందుబాటులో ఉందని చెప్పారు . అనంతరం ఈ బృందం ఈ
బృందం ఉట్నూరు ఆసుపత్రి తో పాటు దంతేనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి
పరిశీలించారు. ఎంపిహెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ నవ్య సుధ వీరి వెంట ఉన్నారు.