కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
జైనథ్, ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):క్షయ వ్యాధి
నివారణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజు
అన్నారు. గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం రోజు పారామెడికల్ సిబ్బంది ,ఆరోగ్య
కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా
గ్రామాల్లో మీరు విధులు నిర్వహిస్తున్న సమయంలో క్షయ వ్యాధి పై కూడా ప్రచారాలు
నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో క్షయ వ్యాధికి సంబంధించిన
పరీక్షలకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేదా జిల్లా నివారణ అధికారి
కార్యాలయంలో గల ఆసుపత్రికి తీసుకువచ్చి పరిక్షలు చేయించాలని తెలిపారు. టార్గెట్లు తప్పనిసరిగా పూర్తి
చేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ పూర్తయిందని ఫీల్డ్
కి వెళ్ళిన సమయంలో ఆశా కార్యకర్తలతో పాటు గ్రామాల్లో గ్రామ సర్పంచ్ దృష్టికి
తీసుకువెళ్లి అనుమానితులకు క్షయ పరీక్షలు నిర్వహించాలన్నారు. లక్ష్యసాధన
కొరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తే లక్ష్య సాధన పూర్తవుతుందని ఈ సందర్భంగా ఆయన
పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లో గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి
డాక్టర్ నిర్మల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.