కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
బోథ్, ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):బోథ్
ఎంపీటీసీ షేక్ రజియా బేగం తన ఉదారత చాటుకున్నారు.
లాక్ డౌన్ సమయం లో గర్భిణీ స్త్రీలకు, అత్యవసరవైద్య సేవలకు సంబంధిం ఉచిత
సేవలు ప్రారంభించారు. బుదవారం మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మాసం అనిల్,ఎంపీటీసీ
మహేందర్ చేతుల మీదుగా రిబ్బెన్ కట్ చేసి సేవలు ప్రారంభించారు. అనంతరం ఎంపీటీసీ
షేక్ రజియా బేగం, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మాసం అనిల్,ఎంపీటీసీ
మహేందర్లు మాట్లాడుతూ గర్భిణులు,వికలాంగులు ఎవరికైనా ఉచిత ఆటో
సౌకర్యం కల్పించబడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపినారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని
ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ ఉచిత ఆటో ను , ఈ సౌకర్యాన్నిఅత్యవసర సేవలకు
మాత్రమే వినియోగించుకోవాలని ఆమె
పేర్కొన్నారు.వాహనం అవసరం ఉన్నవారు కింది
సుచించిన నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.9493977769,8106974479,7993002644. కార్యక్రమంలో బోథ్ పట్టణ వార్డు
సభ్యులు షేక్ షాకీర్,సల్ల రవి, పసుల చంటి తదితరులు పాల్గొన్నారు