కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
బోథ్ సిఐ ఎం.నైలు
బోథ్,ఆదిలాబాద్,(ఆరోగ్యజోతి): వర్షాకాలం ప్రారంభం అయిందని ప్రజలు తమ తమ పొలాల్లో ఇతర పనుల్లో వీలైనంత తొందరగా ముగించుకొని ఇంటి దగ్గరకు చేరుకోవాలని సిఐ అన్నారు. వర్షాకాలం కావడం వల్ల వాగులు వంకలు పొంగి ప్రజలు ఇబ్బందులు పడతారని దీనిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇంటిదారి పట్టాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు కావడం వల్ల మురికి కాలువలు బురదమయం అక్కడక్కడ వర్షాల కారణంగా వాటిని గుర్తించడం కష్టమని కరెంటు వైర్లు కింద పడి ఉంటే ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నారు. ప్రజల బాగోగుల గురించి పత్రికలు టీవీల ద్వారా వాతావరణ సమాచారాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్త వహించాలన్నారు. వర్షాకాలంలో పురాతన ఇళ్లలో దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలందరూ ఈ జాగ్రత్తలను పాటించాలని ఆయన కోరారు. ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో ఆరుబయట ఉండకుండా. చెట్ల కింద కూడా ఉండవద్దని సి ఐ తెలిపారు. ప్రజలందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. ఏదైనా ప్రమాదాలు సంభవించి నట్లయితే పోలీస్వారి దృష్టికి కానీ లేక 100 నెంబర్ కు ఫోన్ చేసి తెలుపగలరు అని సిఐ తెలిపారు.